ప్రపంచ దేశాలకు ఇరాన్ బంపర్ ఆఫర్.. ‘హర్మూజ్’లో 60 రోజుల పాటు ఉచిత ప్రయాణం!
- ఒప్పందం ప్రకారం ‘హర్మూజ్’లో రవాణా రుసుములను రద్దు చేసిన ఇరాన్
- రాబోయే 60 రోజుల పాటు అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఉచిత ప్రయాణం
- ఇరాన్ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనాన్ని అధికారికంగా తొలగించిన అమెరికా
- పర్షియన్ గల్ఫ్ జలసంధి అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి
అమెరికాతో కుదిరిన చారిత్రక 14 సూత్రాల తాత్కాలిక అవగాహన ఒప్పందం అమలులో భాగంగా ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే అన్ని రకాల అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు రాబోయే 60 రోజుల పాటు రవాణా రుసుములను (ట్రాన్సిట్ ఫీజు) పూర్తిగా మినహాయిస్తున్నట్లు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వెల్లడించింది. ఈ కాలంలో నౌకల ప్రయాణానికి అయ్యే అనుబంధ ఖర్చులను ఇరాన్ ప్రభుత్వమే భరించనుంది. అయితే భద్రతా కారణాలు, కార్యాచరణ నిబంధనల దృష్ట్యా ప్రతి నౌక పర్షియన్ గల్ఫ్ జలసంధి అథారిటీ నుంచి ముందస్తు అనుమతి పొందాలని, అలాగే కేటాయించిన ప్రత్యేక మార్గాల్లోనే ప్రయాణించాలని స్పష్టం చేసింది.
ఈ తాత్కాలిక ఒప్పందానికి అనుగుణంగా అమెరికా రక్షణ విభాగం కూడా కీలక అడుగు వేసింది. ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకాదళ దిగ్బంధన అమలును అమెరికా సైన్యం అధికారికంగా నిలిపివేసింది. దీనివల్ల అంతర్జాతీయ నౌకలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇరాన్ రేవుల్లోకి రాకపోకలు సాగించడానికి మార్గం సుగమమైంది. ఈ దిగ్బంధనం తొలగడంతో హర్మూజ్ జలసంధి ద్వారా లక్షలాది బ్యారెళ్ల ముడి చమురు రవాణా మళ్లీ పుంజుకుంది. ఫలితంగా ప్రపంచ ఇంధన మార్కెట్లో ముడి చమురు ధరలు వేగంగా తగ్గుముఖం పడుతున్నాయి, ఇది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరటనిచ్చే పరిణామం. యుద్ధ వాతావరణం వల్ల నష్టపోయిన వాణిజ్య రంగాన్ని మళ్లీ ఉత్సాహపరిచేందుకు ఇరాన్ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసింది.
ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు వాటా కలిగిన హర్మూజ్ జలసంధిలో ప్రస్తుతానికి ఉచిత ప్రయాణాన్ని ప్రకటించినప్పటికీ.. 60 రోజుల గడువు తర్వాత ఏం జరుగుతుందనే దానిపై అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ జలసంధి గుండా శాశ్వతంగా ఉచిత ప్రయాణం ఉండాలని ఆశిస్తుండగా, ఇరాన్ అధికారులు మాత్రం 60 రోజుల తర్వాత పర్యావరణ, రవాణా సేవల పేరిట తిరిగి ఫీజులు వసూలు చేస్తామని సంకేతాలు ఇస్తున్నారు. ఈ లోపు ఇరు దేశాల మధ్య జరగబోయే సమగ్ర దౌత్యపరమైన చర్చలలో అణు కార్యక్రమాలు, ఆర్థిక ఆంక్షల శాశ్వత తొలగింపుతో పాటు ఈ ఫీజుల వివాదానికి కూడా తుది పరిష్కారం కనుగొనాల్సి ఉంది.